Ganni Krishna: రాజమండ్రి టికెట్‌ను స్థానికేతరులకు కేటాయించవద్దు: టీడీపీ కార్పోరేటర్లు

  • టికెట్ల కేటాయింపు విషయంలో ఆందోళనలు
  • గన్ని కృష్ణకే రాజమండ్రి స్థానాన్ని కేటాయించాలి
  • పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు

ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ టికెట్ల కేటాయింపుపై దృష్టి సారించాయి. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో పలు చోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి ఎంపీ టికెట్‌ను స్థానికేతరులకు కేటాయించవద్దంటూ టీడీపీ కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ టికెట్‌ను స్థానికుడైన గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గన్ని కృష్ణకే ఇ్వవాలని ఆయన అనుచరులతో పాటు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి గన్ని కష్టపడుతున్నారని, కాబట్టి ఎంపీ టికెట్ ఆయనకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News