paruchuri: చిరంజీవి గారే నేరుగా ఫోన్ చేస్తారని ఊహించలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'కొదమ సింహం' కథ విన్నాను 
  • కథలో లోపం ఎక్కడుందో తెలిసింది
  •  మంచి విజయాన్ని సాధించింది

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, చిరంజీవి హీరోగా చేసిన 'కొదమసింహం' సినిమాను గురించి ప్రస్తావించారు. 'కొదమ సింహం' సినిమా కోసం కథా కథనాలపై కసరత్తు జరుగుతోన్న సమయంలో, చిరంజీవి గారు నేరుగా నాకు ఫోన్ చేశారు. ఆయన నేరుగా ఫోన్ చేస్తారని నేనసలు ఊహించలేదు.

'కొదమ సింహం' కథను వేరేవాళ్లు రాశారు .. సంభాషణలపై సత్యానంద్ గారు కూర్చున్నారు. కథ వింటుంటే ఎక్కడో లోపం వుందని నాకు అనిపిస్తోంది .. ఒకసారి మీరు వినండి .. ఏ లోపం లేదని మీరు చెబితే ముందుకు వెళతాం .. లేదంటే స్క్రీన్ ప్లేపై మీరు కూర్చోండి' అని చిరంజీవిగారు అన్నారు.

చిరంజీవిగారు చెప్పినట్టుగానే నేను వెళ్లి కథ విన్నాను. ఈ సినిమాలో 'సుడిగాలి' అనే పాత్రను మోహన్ బాబు పోషించారు. ఇంటర్వెల్ సమయానికి ఆ పాత్ర చనిపోతుందని సత్యానంద్ నాకు చెప్పారు. 'ఆ పాత్ర చనిపోతే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అనేది పోతుంది .. అందువలన ఆ పాత్ర చనిపోకూడదు' అని చెప్పాను. 'సుడిగాలి' బ్రతికుంటే ఎలా ఉంటుందనేది అక్కడి నుంచి స్క్రీన్ ప్లే వేశాము. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News