varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఆపివేయాలంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది: వర్మ

  • టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీకి ఫిర్యాదు చేశారు
  • చంద్రబాబును నెగెటివ్ గా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు
  • ఎన్నికలు ముగిసేంత వరకు విడుదలను ఆపివేయాలని కోరారు

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేసిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఈ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగెటివ్ గా చూపించారని, సినిమా విడుదలైతే ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ముగిసేంత వరకు సినిమా విడుదలను ఆపివేయాలని కోరారని చెప్పారు. మరోవైపు, ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు సోషల్ మీడియా ద్వారానే రామ్ గోపాల్ వర్మ ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కలలోకి వచ్చారని, ఎన్టీఆర్ ఆశీర్వదించారని ట్వీట్లు చేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో పలు సర్వేలు పెడుతూ పబ్లిసిటీని పెంచుతున్నారు.

More Telugu News