India: మసూద్ అజహర్ విషయంలో మరోసారి నీతులు వల్లించిన చైనా

  • భారత్, పాక్ లు చర్చలు నిర్వహించాలి
  • బాధ్యతాయుత పరిష్కారానికి అదే మార్గం అంటూ సుద్దులు
  • మారని చైనా తీరు

మరో రెండ్రోజుల్లో మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం రానున్న నేపథ్యంలో చైనా గుంభనంగా వ్యవహరిస్తోంది. ఈ తీర్మానంపై ఇప్పటికీ తన వైఖరి ఏంటో చెప్పని చైనా... భారత్, పాకిస్థాన్ దేశాలు ఎలా వ్యవహరించాలో మాత్రం చెబుతోంది. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలకు బాధ్యతాయుతమైన పరిష్కారం రావాలంటే చర్చలే మార్గమని పాతపాటే పాడింది. పుల్వామా దాడి అనంతరం భారత్, పాక్ మధ్య చర్చల్లో భద్రతాపరమైన అంశాలే ప్రధాన అంశాలుగా ఉండాలని సూచించింది.

కాగా, దాయాది దేశాల గొడవల్లో చైనా మధ్యవర్తిత్వం వహించబోతోందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ మాట్లాడుతూ, గతంలో కూడా తాము ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాల కోసం ఎంతో కృషి చేశామని చెప్పారు.

More Telugu News