chaitu: 'మజిలీ' నుంచి ఆకట్టుకుంటోన్న లిరికల్ వీడియో సాంగ్

  • శివ నిర్వాణ నుంచి 'మజిలీ'
  • గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  •  ఏప్రిల్ 5వ తేదీన విడుదల    

నాగచైతన్య .. సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా నిర్మితమైంది. అందం .. ఆరాధన .. ఆనందం .. ఆశయం .. ఆవేశం .. మొదలైన అంశాలు చోటుచేసుకున్న కథగా ఈ సినిమా రూపొందింది. సమంత - చైతూ ఈ కథలోను భార్యాభర్తలుగా కనిపించనుండటం విశేషం. గోపిసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి 'ప్రియతమా .. ప్రియతమా .. పలికింది హృదయమే' అనే రెండవ సాంగ్ ను విడుదల చేశారు. "చైతన్య ప్రసాద్ సాహిత్యం .. చిన్మయి శ్రీపాద ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తరువాత సమంత - చైతూ కలిసి చేస్తోన్న ఈ సినిమా, అనూహ్యమైన విజయంతో వాళ్లకి ఒక తీపిజ్ఞాపకంగా మిగిలిపోతుందేమో చూడాలి

More Telugu News