sensex: మార్కెట్లపై ఎన్నికల షెడ్యూల్ ప్రభావం.. దూసుకుపోయిన సెన్సెక్స్

  • ఆరు నెలల గరిష్ఠ స్థాయికి మార్కెట్లు
  • 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 133 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో ఆరు నెలల గరిష్ఠ స్థాయికి మార్కెట్లు చేరుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 37,054కు చేరుకుంది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 11,168కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (8.08%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.90%),  కోల్ ఇండియా (3.80%), వేదాంత లిమిటెడ్ (2.52%), టాటా స్టీల్ (2.51%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-0.41%), హెచ్సీఎల్ (-0.39%), ఎన్టీపీసీ (-0.23%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.21%), ఇన్ఫోసిస్ (-0.13%). 

More Telugu News