india today: ఎస్సీలు, ముస్లింలలో రాహుల్ గాంధీకే ఆదరణ ఎక్కువ: ఇండియా టుడే సర్వే

  • జనవరితో పోల్చితే పెరిగిన రాహుల్ పాప్యులారిటీ
  • 44 శాతం ఎస్సీలు, 61 శాతం ముస్లింలు రాహుల్ వెంటే
  • 41 శాతం ఎస్సీలు, 18 శాతం ముస్లింలు మోదీకి మద్దతు

ఎస్సీలు, ముస్లింలలో ప్రధాని నరేంద్ర మోదీ కంటే కాంగ్రెస్ అధినేత రాహల్ గాంధీకే ఎక్కువ జనాకర్షణ ఉందని పీఎస్ఈ (పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) సర్వేలో వెల్లడైంది. ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారంటూ ఇండియా టుడే నిర్వహించిన సీఎస్ఈ సర్వేలో ఎస్సీలు, ముస్లింలలో అధికులు రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపారు.

రాహుల్ ప్రధాని కావాలని 44 శాతం మంది ఎస్సీలు కోరుకోగా.. 41 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపారు. ముస్లింలలో ఏకంగా 61 శాతం మంది రాహుల్ గాంధీకే జై కొట్టారు. కేవలం 18 శాతం మంది ముస్లింలు మాత్రమే మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. జనవరిలో నిర్వహించిన సర్వే కంటే తాజా సర్వేలో రాహుల్ పాప్యులారిటీ 4 శాతం పెరిగింది. ఇదే సమయంలో మోదీ పాప్యులారిటీ కేవలం ఒక శాతం మాత్రమే పెరిగింది. అయితే, అన్ని సామాజికవర్గాల ప్రకారం చూస్తే మోదీ ప్రధాని కావాలని 51 శాతం మంది కోరుకుంటున్నారు. రాహుల్ 33 శాతం పాప్యులారిటీని సాధించారు.

More Telugu News