lawrence: 'కాంచన 3' విడుదల తేదీ ఖరారు

  • లారెన్స్ నుంచి 'కాంచన 3'
  • నాయికలుగా ఓవియా .. వేదిక
  •  ఏప్రిల్ 19వ తేదీన విడుదల          

హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలోను .. ఆ చిత్రాలలో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలు తమిళంలో భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టాయి.

ఈ నేపథ్యంలో ఆయన నుంచి మరో హారర్ థ్రిల్లర్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా 'కాంచన 3' సినిమాను పూర్తి చేసిన లారెన్స్, ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసేశాడు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవియా .. వేదిక ఈ సినిమాలో లారెన్స్ సరసన కనిపించనున్నారు. ఇంతవరకూ లారెన్స్ చేస్తూ వచ్చిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సారి లారెన్స్ ఏ స్థాయిలో భయపెడతాడో చూడాలి మరి.

More Telugu News