drs: ఈ 'డీఆర్ఎస్' ఏంట్రా బాబూ.. నాకేమీ అర్థం కావడం లేదు!: కోహ్లీ

  • డీఆర్ఎస్ తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టర్నర్
  • ఫలితాన్ని తారుమారు చేసిన డీఆర్ఎస్
  • డీఆర్ఎస్ ను తప్పుబట్టిన కోహ్లీ

క్రికెట్లో ప్రవేశ పెట్టిన డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) పై టీమిండియా కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఓటమికి డీఆర్ఎస్సే కారణం. 43 బంతుల్లో 84 పరుగులు చేసిన టర్నర్... ఆసీస్ కు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే 44 ఓవర్లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి టర్నర్ ఔట్ అయ్యాడు. అయితే, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఇండియా రివ్యూను కోరింది. రీప్లేలో బ్యాట్ కు బంతి తగిలినట్టు తేలింది. నికోమీటర్ లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్ తో ఏకీభవించిన థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో, మ్యాచ్ ఫలితం మారిపోయింది.

దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ సమీక్ష తమను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు. ప్రతి మ్యాచ్ లోనూ డీఆర్ఎస్ పై చర్చ జరుగుతోందని... ఈ విధానానికి నిలకడ లేదని విమర్శించాడు. అసలు ఈ డీఆర్ఎస్ ఏంటో అర్థంకాకుండా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News