Tamil Nadu: ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే.. తమిళనాట హడావుడిగా పోలీసు అధికారులకు పదోన్నతి

  • ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి
  • సుప్రీంకోర్టు నిబంధనలను పక్కనపెట్టి మరీ ఉత్తర్వులు
  • వివాదాస్పదమవుతున్న పళని ప్రభుత్వ తీరు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు మరికొద్ది సేపట్లో విడుదలవుతుందనగా తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. షెడ్యూలు విడుదలకు కొన్ని గంటల ముందు పలువురు సీనియర్ పోలీసు అధికారులకు డీజీపీలుగా ప్రమోషన్ కల్పించింది. మొత్తం ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టు నిబంధనలను పక్కనపెట్టి మరీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది.

డీజీపీలాంటి పోస్టుల్లో నియమించే వారికి నిజానికి రెండేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం పేర్కొంది. ప్రభుత్వం ఇప్పుడు నియమించిన పదోన్నతి కల్పించిన అందిరికీ రెండేళ్ల లోపే సర్వీసు ఉండడం గమనార్హం. అయితే, రెండేళ్ల నిబంధనను మార్చాలంటూ పళని ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి డీజీ ర్యాంకు ఉన్న అధికారులు ఆరుగురు మాత్రమే ఉంటారు. అయితే, తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో వారి సంఖ్య ఏకంగా 14కు పెరిగింది.

More Telugu News