anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పక్కాగా వుంటానంటున్న అనుపమ 
  • సోషియో ఫాంటసీ చిత్రంలో కల్యాణ్ రామ్ 
  • 'వాల్మీకి'లో ప్రముఖ బాలీవుడ్  నటుడు

*  మొహమాటాలకు పోయి సినిమాలు ఒప్పుకోవడం అన్నది చేయను.. అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'కొత్త సినిమాల ఎంపిక విషయంలో నేను చాలా పక్కాగా వుంటాను. మొహమాటాలు వుండవు. నాకు నచ్చిందంటే మాత్రం ఓకే చెప్పేస్తాను. నచ్చకపోతే తప్పుకుంటాను. అంతేతప్ప ఏదో అడిగారు కదా అని చెప్పి ఒప్పేసుకోను. ఎందుకంటే, ఏ నిర్ణయమైనా రేపు ఫలితాన్ని అనుభవించాల్సింది నేనే కదా?' అని చెప్పింది అనుపమ.
*  తాజాగా '118' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నందమూరి కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందే ఈ చిత్రానికి 'అశ్వత్థామ' అనే టైటిల్ని నిర్ణయించారు.
*  ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తాజా చిత్రాన్ని హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'వాల్మీకి' పేరిట రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రలో కనిపిస్తాడు. కాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తాడట.

More Telugu News