election: ఏయే దశల్లో ఏయే రాష్ట్రాలకు, ఎన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి... వివరాలు

  • తొలి దశలోనే ఏపీలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు
  • తెలంగాణకు కూడా తొలి దశలోనే పోలింగ్
  • మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే దశలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందో చూడండి.

ఫేజ్ వన్ (రాష్ట్రం, నియోజకవర్గాల సంఖ్య):
ఏపీ 25, అరుణా చల్ ప్రదేశ్ 2, అసోం 5, బీహార్ 4, చత్తీస్ గఢ్ 1, జమ్ముకశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం 1, తెలంగాణ 17, త్రిపుర 1, యూపీ 8, ఉత్తరాఖండ్ 5, పశ్చిమబెంగాల్ 2, అండమాన్ నికోబార్ 1, లక్షద్వీప్ 1. మొత్తం 91 నియోజకవర్గాలు.

ఫేజ్ టూ:
అసోం 5, చత్తీస్ గఢ్ 3, బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, మణిపూర్ 1, ఒడిశా 5, తమిళనాడు 39, త్రిపుర 1, యూపీ 8, పశ్చిమబెంగాల్ 3, పుదుచ్చేరి 1. మొత్తం 97 నియోజకవర్గాలు.

మూడో ఫేజ్:
అసోం 4, బిహార్ 5, చత్తీస్ గఢ్ 7, గుజరాత్ 26, గోవా 2, జమ్ముకశ్మీర్ 1, కర్ణాటక 14, కేరళ 20, మహారాష్ట్ర 14, ఒడిశా 6, యూపీ 10, పశ్చిమబెంగాల్ 5, దాద్రా మరియు నగర్ హవేలీ 1, డమన్ మరియు డయూ 1. మొత్తం నియోజకవర్గాలు 115.

నాలుగో ఫేజ్:
బీహార్ 5, జమ్ముకశ్మీర్ 1, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 17, ఒడిశా 6, రాజస్థాన్ 13, యూపీ 13, పశ్చిమబెంగాల్ 8. మొత్తం నియోజకవర్గాలు 71.

ఐదో ఫేజ్:
బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2, మధ్యప్రదేశ్ 7, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమబెంగాల్ 7. మొత్తం నియోజకవర్గాలు 51.

ఆరో ఫేజ్:
బీహార్ 8, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, చండీగఢ్ 1, ఉత్తరప్రదేశ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4. మొత్తం నియోజకవర్గాలు 59.

ఏడో ఫేజ్:
బిహార్ 8, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, చండీగఢ్ 1, ఉత్తరప్రదేశ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4. మొత్తం నియోజకవర్గాలు 59.

వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలకు కూడా అదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి.

More Telugu News