Telangana: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేస్తా.. చిరుమర్తి లింగయ్య సంచలన ప్రకటన!

  • నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికయిన లింగయ్య
  • పార్టీ మారడంపై కాంగ్రెస్ నేతల విమర్శలు
  • సంక్షేమ పథకాలు, అభివృద్ది చూసి టీఆర్ఎస్ లో చేరుతున్నానన్న నేత

కాంగ్రెస్ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి గెలిచినందున ఆ పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మళ్లీ టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేస్తానని సంచలన ప్రకటన చేశారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదనీ, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ లో చేరుతున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ది కోసం టీఆర్ఎస్ పనిచేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం కేసులతో అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకు వచ్చానని స్పష్టం చేశారు. చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడటంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోయినా పట్టుబట్టి లింగయ్యకు సీటు ఇప్పించామనీ, కానీ తమకే నమ్మకద్రోహం చేస్తాడని ఊహించలేదని రాజగోపాల్ రెడ్డి బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి గెలిచిన స్థానానికి రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లాలని లింగయ్య భావిస్తున్నట్లు సమాచారం.

More Telugu News