Telangana: సిరిసిల్ల జిల్లాలో రియల్ ఎస్టేట్ బూమ్.. పొలాలను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్న రియల్టర్లు!

  • ఎకరం రూ.30-50 లక్షలు పలుకుతున్న భూమి
  • ప్లాటును రూ.6-10 లక్షలకు అమ్ముతున్న రియల్టర్లు
  • పన్నును చెల్లించడం లేదన్న రెవెన్యూ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని భూములకు రెక్కలు వచ్చాయి. ఆలయ పరిసరాల్లోని భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ధరలకు కొనుగోలు చేసి ఫ్లాట్లుగా మారుస్తున్నారు.

రైతుల పొలాలను ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న రియల్టర్లు.. వాటిని ప్లాట్లుగా మారుస్తున్నారు. అనంతరం ఒక్కో ప్లాట్ ను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ అమ్ముతున్నారు. కాగా, ఈ అమ్మకాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారని రెవిన్యూ అధికారులు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News