నేడే ఎన్నికల నగరా?...సాయంత్రం ఐదు గంటలకు ఈసీ మీడియా సమావేశం

10-03-2019 Sun 11:22
  • సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం
  • లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
  • షెడ్యూల్ విడుదలైతే కోడ్‌ అమల్లోకి

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమయ్యిందని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహిస్తుండడంతో ఎన్నికల ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు. షెడ్యూల్‌ విడుదలైతే కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభతోపాటు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. తొమ్మిది లేదా 10 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేశారు.