Hyderabad: రాహుల్‌ ప్రసంగాన్ని ఆకట్టుకునేలా అనువదించిన దాసోజు శ్రవణ్‌

  • శంషాబాద్‌ సభలో ప్రసంగించిన రాహుల్‌
  • రాహుల్‌లాగే హావభావాలు ఒలికించిన శ్రవణ్‌
  • సభికుల నుంచి మంచి స్పందన

అధినాయకుని ప్రసంగం ఎంత చక్కగా ప్రజల్లోకి వెళితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. సాధారణంగా జాతీయ స్థాయి నాయకులు ఇంగ్లీష్‌ లేదా హిందీలో ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని స్థానికులకు అర్థమయ్యేలా వారి భాషలో తర్జుమాచేసి అవే హావభావాలతో ప్రసంగిస్తే సభికులనే కాదు, ప్రసంగించిన అధినేతనూ ఆకట్టుకోవచ్చు.

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ శనివారం తన చక్కని అనువాదంతో ఆకట్టుకున్నారు. శంషాబాద్‌లో శనివారం జరిగిన రాహుల్‌గాంధీ సభలో ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించే బాధ్యతను నిర్వాహకులు దాసోజు శ్రవణ్‌కు అప్పగించారు. రాహుల్‌ తన ప్రసంగం సందర్భంగా ఒలికించిన హావభావాలన్నింటినీ దాసోజు కూడా తన ప్రసంగంలో కనిపించేలా చేయడంతో సభికుల నుంచి మంచి స్పందన కనిపించింది. దీంతో నిర్వాహకులు సంతోషించారు.

More Telugu News