Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విడుదలకు రెడీ అవుతున్న 'దేవి 2' 
  • దశరథ్ దర్శకత్వంలో చైతు 
  • మళ్లీ పాట పాడిన కీరవాణి   

*  తమన్నా, ప్రభుదేవా కలసి నటించిన 'దేవి 2' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 12న విడుదల చేస్తారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం మారిషస్ లో జరిగింది.
*  ప్రస్తుతం 'మజిలి', 'వెంకీమామ' చిత్రాలలో నటిస్తున్న అక్కినేని నాగ చైతన్య త్వరలో మరో ప్రేమకథా చిత్రంలో నటించనున్నాడు. గత కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరంగా వున్న ప్రముఖ దర్శకుడు దశరథ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
*  ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో పాటలు పాడుతుండడం మనకు తెలిసిందే. అలాగే తాజాగా అడవి శేష్ హీరోగా రూపొందుతున్న 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రంలో కీరవాణి ఓ పాట పాడారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సారథ్యంలో ఈ పాటను రికార్డు చేశారు.  

More Telugu News