Reliance: పెళ్లివేదికా.. ఇంద్రలోకమా!.. అంబానీ పెళ్లివేడుకలో అద్భుత దృశ్యం

  • సినిమా సెట్టింగ్ లను మించిపోయిన వివాహ వేదిక
  • కళ్లు చెదిరే రీతిలో ఏర్పాట్లు
  • అడుగడుగునా కమనీయం

భారత్ లో తిరుగులేని సంపన్నుడిగా ఖ్యాతిగాంచిన ముఖేష్ అంబానీ తన స్థాయికి తగ్గ విధంగా కుమారుడి పెళ్లి చేశారు. తనయుడు ఆకాశ్ అంబానీ వివాహాన్ని భారీగా ఖర్చుపెట్టి జరిపించారు. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ ఆకాశ్-శ్లోకా మెహతాల  వివాహ మహోత్సవానికి వేదికగా నిలిచింది. ఈ పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లు చూస్తే స్వర్గలోకమే కిందికి దిగివచ్చినట్టుగా అనిపిస్తుంది. వివాహ వేదిక మొదలుకుని ప్రతి అంశంలోనూ రిచ్ నెస్ పొంగిపొర్లుతోంది. ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా సెట్టింగ్ లను తలదన్నే రీతిలో ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కృతం చేశారు ముఖేష్ అంబానీ. ఈ పెళ్లి ఏర్పాట్లు చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనం ఈ ఫొటోలు...

More Telugu News