Pakistan: ఆర్మీ టోపీలు ధరించి క్రికెట్ ఆడటమేంటి?: భారత్ పై పాక్ ఫిర్యాదు

  • అమర జవానులకు నివాళిగా ఆర్మీ టోపీలు
  • ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్ మంత్రి
  • మేం కూడా నలుపు బ్యాండ్‌లు ధరిస్తాం

భారత క్రికెటర్లు ఆర్మీ టోపీలు ధరించి ఆట ఆడటాన్ని పాక్ తప్పుబట్టింది. ఇటీవల పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా నిన్న జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ క్రికెటర్లు ఆర్మీ టోపీలు ధరించారు. అయితే దీనిపై ఆగ్రహించిన పాక్.. క్రికెట్‌ను భారత్ టీం రాజకీయం చేసిందని.. దీనిపై చర్య తీసుకోవాలంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని కోరింది.

పాక్ మంత్రి పవాద్ చౌదరి ఈ మేరకు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఒకవేళ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తే, కశ్మీర్‌లో భారత్ జరుపుతున్న దురాగతాలకు నిరసనగా తమ టీం కూడా నలుపు బ్యాండ్‌లు ధరిస్తుందని తెలిపారు.

More Telugu News