Chiranjeevi: చిరంజీవి బయోపిక్ గురించి నాగబాబు!

  • సినిమాల రూపంలో పలువురి బయోపిక్ లు
  • బయోపిక్ అంటే నవరసాలూ ఉండాలి
  • ఎప్పుడూ విజయం సాధించిన వారి చిత్రాలను చూడలేం

  ఇది బయోపిక్ ల కాలం. ఇప్పటికే పలువురి బయోపిక్ లు చలనచిత్రాల రూపంలో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. టాలీవుడ్ లో సైతం మహానేత ఎన్టీఆర్, మహానటి సావిత్రి బయోపిక్ లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో అంచెలంచెలుగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? మెగా ఫ్యామిలీనే దీన్ని నిర్మిస్తుందా? ఓ వెబ్ చానల్ ఈ ప్రశ్నలకు నాగబాబు ముందు ఉంచగా, ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

 "నాకు అసలు... అన్నయ్య మీద బయోపిక్ తీయాలన్న ఉద్దేశం లేదండీ. మేబీ చరణ్ బాబుకు కూడా ఉండుండదని అనుకుంటున్నాను. ఎందుకంటే, అంత సెల్ఫ్ ప్రమోషన్ యాటిట్యూడ్ కాదు ఆయనది. కాకపోతే... బయోపిక్ తీయడానికి కొన్ని లక్షణాలు ఉండాలండీ... సిల్క్ స్మిత బయోపిక్ ఎందుకు బాగుంటుంది? డర్టీ పిక్చర్... ఒక ఆడపిల్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, సక్సెస్... సిల్క్ స్మిత ఏమీ మహానటి సావిత్రి అంత గొప్పనటేమీ కాదు. కానీ సక్సెస్ ఫుల్ బయోపిక్...

అలాగే సంజూ మీద... సంజయ్ దత్ మీద... సక్సెస్ ఫుల్ పీపుల్ మీద బయోపిక్ తీయాలంటే చూడటానికి... మనకు సినిమా అంటే ఏంటి? ఒక అప్ అండ్ డౌన్, ఒక కష్టం, ఒక సంతోషం, ఒక విజయం, ఒక అపజయం కలిస్తే ఇంట్రస్టింగ్ గా వుంటుంది. అల్టిమేట్ గా బయోపిక్ అన్నా సినిమాయే కదా? సినిమాను ఆ విధంగా చూడాలని అనుకుంటాంగానీ, ఎప్పుడు సక్సెస్ ఫుల్ గా వెళ్లిపోయే వ్యక్తిపై బయోపిక్ తీస్తే ఇంట్రస్టింగ్ గా ఏం ఉంటుందన్నది నా ఉద్దేశం" అని అన్నారు.

More Telugu News