Lakshmi's NTR: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బాలయ్యకే అంకితం: రామ్ గోపాల్ వర్మ!

  • ప్రతి ఆలోచన వెనుకా ఓ స్ఫూర్తి ఉంటుంది
  • ఈ చిత్రం తీయాలన్న స్ఫూర్తి నిచ్చింది బాలయ్యే
  • వైస్రాయ్ హోటల్ లో ఏం జరిగిందో తనకు తెలియదన్న వర్మ

తనకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీయాలన్న ఆలోచన రావడానికి నందమూరి బాలకృష్ణ స్ఫూర్తినిచ్చారని, అందుకే ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నానని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఈ నెల 22న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, హైదరాబాద్ లో జరిగిన ట్రయిలర్ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు.

ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని, అలాగే, ఏ సినిమా అయినా, తొలి స్ఫూర్తి ఇవ్వడానికి ఒకరుంటారని, అక్కడి నుంచి మొదలయ్యే ఆలోచనే సినిమా అవుతుందని, వర్మ చెప్పారు. ఈ సినిమాకు తనలో అటువంటి ఆలోచన రావడానికి బాలయ్యే కారణమని చెప్పారు. వైస్రాయ్ హోటల్ లో ఏం జరిగిందన్న సంగతి తనకు తెలియదని, అప్పుడు తాను ముంబైలో 'రంగీలా' షూటింగ్ లో ఉన్నానని చెప్పిన వర్మ, ఆపై ఎంతో మందిని కలిసి, మాట్లాడి, ఈ చిత్రం స్క్రీన్ ప్లేను తయారు చేసుకున్నట్టు తెలిపారు.

More Telugu News