Sonali Bendre: కేన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు 30 శాతమే ఛాన్స్ ఉందన్నారు: సోనాలి బింద్రే

  • న్యూయార్క్ వెళ్లటం ఇష్టం లేదు
  • నా భర్త బలవంతం మీదే వెళ్లా
  • విమానంలో కూడా పోట్లాడుతూనే ఉన్నా

నాలుగో దశలో తనకు కేన్సర్ ఉందన్న విషయాన్ని తెలుసుకుని సినీ నటి సోనాలి బింద్రే ఆమధ్య న్యూయార్క్ వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బతికే అవకాశం 30 శాతం మాత్రమే ఉందని తేల్చారట. ఆత్మస్థైర్యంతో 30 శాతాన్ని నూరు శాతంగా మలుచుకున్న సోనాలి ప్రస్తుతం కేన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. కేన్సర్ ఉందని తెలియగానే తనలో చెలరేగిన ఆలోచనల్ని తాజాగా ఆమె ఓ వేదికపై పంచుకుంది. తాను చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లినపుడు కేన్సర్ నాలుగో దశలో ఉందని తెలిసిందని.. కేవలం 30 శాతమే తాను బతికే అవకాశం ఉందని వైద్యులు తెలిపారని సోనాలి పేర్కొంది.

తనకైతే న్యూయార్క్ వెళ్లాలని అసలు ఇష్టం లేదని.. తన భర్త గోల్డీ బెహల్ బలవంతం మీదనే వెళ్లానని తెలిపింది. విమానంలో కూడా.. మన దేశంలో మంచి వైద్యులు లేరా? వేరే దేశం ఎందుకు వెళ్లాలని భర్తతో పోట్లాడినట్టు సోనాలి వెల్లడించింది. మూడు రోజులు ఉండి వచ్చేద్దామనుకున్న తాను.. ప్రయత్నించి చూద్దామనుకుని అక్కడే ఉండిపోయానని తెలిపింది. న్యూయార్క్ వెళ్లిన మర్నాడే వైద్యుల్ని కలవగా పరీక్షలన్నీ చేసి తన ఆరోగ్య పరిస్థితి వివరించడంతో అప్పుడు తనకు తెలిసొచ్చిందని.. వెంటనే తనను న్యూయార్క్‌కి తీసుకెళ్లిన భర్తకు ధన్యవాదాలు తెలిపానని సోనాలి పేర్కొంది.  

More Telugu News