kajal: 'సీత' విడుదల తేదీ ఖరారు

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'
  • ఇంతవరకూ చేయని పాత్రలో కాజల్ 
  • ఏప్రిల్ 25వ తేదీన విడుదల  

కాజల్ ప్రధాన పాత్రధారిగా .. తేజ దర్శకత్వంలో 'సీత' రూపొందింది. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమైంది. 'మహిళా దినోత్సవం' సందర్భాన్ని పురస్కరించుకుని, శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ద్వారానే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతవరకూ చేయని ఒక విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో కాజల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత నాయిక ప్రాధాన్యత కలిగిన మరిన్ని చిత్రాలు కాజల్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి' స్థాయిలో తేజకి ఈ సినిమా విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News