paruchuri: 'కొండవీటిదొంగ' కూడా బంగారు గనుల చుట్టూ తిరిగే కథే: పరుచూరి గోపాలకృష్ణ

  • 'కేజీఎఫ్' సినిమాను గురించి ప్రస్తావన 
  • దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు
  • ఇదే పాయింట్ తో 'కొండవీటి దొంగ' చేశాము  

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ 'కేజీఎఫ్' సినిమాను గురించి మాట్లాడారు. 'కేజీఎఫ్' సినిమాను చూస్తే, దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడనేది అర్థమవుతుంది. ప్రత్యేక కృతజ్ఞతలు అని రాజమౌళి పేరు వేశారు. ఆయనకి రష్ చూపించారేమోనని అనుకుంటున్నాను. మీరు గమనిస్తే కథలో చిన్న ఆత్మ కనిపిస్తుంది. గనుల చుట్టూ తిరిగే ఈ ఆత్మతో గతంలో మేము ఒక కథ రాశాము.

 బంగారపు గనుల తవ్వకం .. ఆ తవ్వకానికి లేబర్ ను ఉపయోగించడం .. అక్కడ తవ్వకాలు జరుగుతోన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం, అది టైగర్ జోన్ అని హెచ్చరించడం .. ఎవరైనా అటుగా వెళితే వాళ్లను విలన్ గ్యాంగ్ చంపేసి .. టైగర్ చంపేసిందని ప్రచారం చేయడం .. అప్పుడు కథానాయకుడు ఎంటరై  .. టైగర్ జోన్లోకి వెళ్లి అసలు గుట్టును బయట పెట్టడం 'కొండవీటిదొంగ'లో చూపించడం జరిగింది' అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News