Telangana: మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు రాదు?: టీఆర్ఎస్ నేత కేటీఆర్

  • కేంద్రంలో భాగస్వామి పార్టీలకే నిధులు దక్కాయి
  • అందులో ప్రాతినిధ్యం లేని పార్టీలకు నిధులు ఇవ్వలేదు
  • తెలంగాణ నిర్ణయాత్మక శక్తిగా ఉంటే నిధులొస్తాయి

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీలకే నిధులు దక్కాయని, అందులో ప్రాతినిధ్యం లేని పార్టీలకు నిధులు ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెదక్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే, ప్రధాని మోదీ ముసిముసి నవ్వులు నవ్వారని విమర్శించారు.

తెలంగాణ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉంటే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు రాదని ప్రశ్నించిన కేటీఆర్, నిధులు కూడా వస్తాయని అన్నారు. తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప, నిధులు రాలేదని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుమ్మెత్తి పోశారు.

More Telugu News