pulwama: పుల్వామా తరహా మరో ఆత్మాహుతి దాడికి సిద్ధమైన జైషే మొహమ్మద్

  • బాలాకోట్ దాడికి ప్రతీకారంగా దాడికి సిద్ధమవుతున్న జైష్
  • 3, 4 రోజుల్లో దాడి జరిగే అవకాశం
  • ఈసారి టాటా సుమో వాహనాన్ని వాడే అవకాశం

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. తాజాగా, పుల్వామా తరహా మరో దాడికి జైష్ స్కెచ్ వేసిందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రానున్న 3, 4 రోజుల్లో జమ్ముకశ్మీర్ లో దాడి చేసేందుకు జైష్ యత్నిస్తోందని తెలిపింది.

బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులకు ప్రతీకారంగా జైష్ ఈ దాడికి పాల్పడబోతోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల ప్రకారం దక్షిణ కశ్మీర్ లోని క్వాజీగుండ్, అనంత్ నాగ్ ప్రాంతాల్లో ఐఈడీ దాడి జరిగే అవకాశం ఉంది. ఈ సారి టాటా సుమో వాహనాన్ని మానవబాంబులు వాడే అవకాశం ఉంది.

More Telugu News