Rishabh Pant: గ్రేడ్-ఎకు ఎగబాకిన రిషబ్ పంత్.. బీసీసీఐతో రూ. 5 కోట్ల కాంట్రాక్ట్

  • గతేడాది బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయిన రిషబ్
  • గ్రేడ్-ఎ ప్లస్ నుంచి గ్రేడ్-ఎకు పడిపోయిన ధవన్, భువనేశ్వర్
  • గ్రేడ్-బి నుంచి గ్రేడ్-ఎకు ప్రమోట్ అయిన కుల్దీప్ యాదవ్

ఇటీవల చక్కగా రాణిస్తూ జట్టులో స్థానాన్ని పదిలపరుచుకున్న టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ బీసీసీఐ గ్రేడ్-ఎ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఫలితంగా 2018-19 సంవత్సరానికి గాను ఐదు కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను పొందాడు. గతేడాది బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయిన పంత్.. ఈసారి ఏకంగా గ్రేడ్-ఎ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇక ఇటీవల వరుసగా విఫలమవుతూ వస్తున్న ఓపెనర్ శిఖర్ ధవన్, పేసర్ భువనేశ్వర్ కుమార్‌ల స్థానం దిగజారింది. గతేడాది గ్రేడ్-ఎ ప్లస్‌లో ఉన్న వీరిని బీసీసీఐ ప్రస్తుతం గ్రేడ్-ఎకు పరిమితం చేసింది. గ్రేడ్-ఎ ప్లస్‌లో గతేడాది రూ.7 కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వీరు ఇప్పుడు రూ.5 కోట్లకే పరిమితమయ్యారు. ఇక, బౌలర్ కుల్దీప్ యాదవ్ గ్రేడ్-బి (రూ. 3 కోట్లు) నుంచి గ్రేడ్-ఎకు ప్రమోట్ అయ్యాడు. గ్రేడ్-ఎ ప్లస్‌లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు.

More Telugu News