Sri Lanka: రెప్పపాటులో స్టంపింగ్ చేసిన డేవిడ్ మిల్లర్.. 'నువ్వు ధోనీ'వంటూ డుప్లెసిస్ ప్రశంస

  • శ్రీలంకతో రెండో టెస్టులో ఘటన
  • రెగ్యులర్ కీపర్ డికాక్ మైదానాన్ని వీడడంతో మిల్లర్ కీపింగ్ 
  • తాహిర్ బౌలింగ్‌లో వేగంగా స్టంపింగ్

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కీపింగ్‌లో ఎంత అప్రమత్తంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్‌మన్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెవిలియన్ కు పంపడంలో ధోనీ సిద్ధహస్తుడు. రెప్పపాటులోనే కదిలి వికెట్లను గిరాటేస్తుంటాడు. అందుకే ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు బ్యాట్స్‌మెన్ చాలా జాగ్రత్తగా ఉంటారు.

 శ్రీలంకతో సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ కూడా ఇలాగే వ్యవహరించి కెప్టెన్ డుప్లెసిస్‌తో ప్రశంసలు అందుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా రెగ్యులర్ వికెట్ కీపర్ మైదానాన్ని వీడడంతో డేవిడ్ మిల్లర్ కీపింగ్ గ్లోవ్స్ అందుకున్నాడు. ఇమ్రాన్ తాహిర్ వేసిన ఓ బంతిని శ్రీలంక బ్యాట్స్‌మెన్ విశ్వ ఫెర్నాండో మిస్ చేశాడు. క్షణాల్లోనే బంతిని అందుకున్న మిల్లర్ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ఇది చూసిన కెప్టెన్ డుప్లెసిస్..  ‘నువ్వు ధోనీవి బాసూ’ అంటూ ప్రశంసించాడు. అయితే, మిల్లర్ వేగంగా స్టంప్స్ పడగొట్టినప్పటికీ విశ్వ అప్పటికే క్రీజులోకి రావడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

More Telugu News