ఎమ్మెల్సీ ఎన్నికలు.. సెలవు కావాలంటున్న హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులు

Fri, Mar 08, 2019, 06:45 AM
  • ఈ నెల 22న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • సెలవు కావాలంటున్న హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులు
  • అమరావతిలోని తెలంగాణ ఉద్యోగులు
ఈ నెల 22న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు సెలవు ఇవ్వాలని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు కోరుతున్నారు. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో ఎక్కువమంది కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్లు కావడంతో సెలవు కావాలని కోరుతున్నారు. కాగా, అదే రోజున తెలంగాణలోని మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతిలో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా సెలవు కోరుతున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad