పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. తప్పక గెలుస్తాం: రాజశేఖర్

07-03-2019 Thu 21:00
  • నా తల్లి పోయాక ఒంటరితనాన్ని అనుభవించా
  • ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయా
  • అందరితో ఫోన్‌లో మాట్లాడాను
‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం నరేష్ అని హీరో రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రముఖ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన తల్లి పోయాక.. చాలా ఒంటరితనాన్ని అనుభవించానన్నారు. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. డిప్రెసివ్ మూడ్‌లోకి వెళుతున్నానని భావించినట్టు పేర్కొన్నారు.

అలాంటి సమయంలో నరేష్ వచ్చి ఇది సరైన సమయం.. కలిసి పనిచేద్దామన్నారని తెలిపారు. అప్పుడు తాను కూడా పనిచేయాలని భావించానన్నారు. నరేష్ మాట్లాడినపుడు తనను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమంటే ముందు భయమేసిందన్నారు. అయితే, ఇప్పుడు అందరినీ కలవలేకపోతున్నానని.. కానీ ఫోన్‌లో మాట్లాడానన్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని.. తప్పక గెలుస్తామన్న నమ్మకం వచ్చిందన్నారు.