TRS Mission: 'టీఆర్ఎస్ మిషన్' యాప్ మాయం!

  • అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి సహకరించిన యాప్
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు
  • పనిచేయని వెబ్ సైట్

గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన 'టీఆర్ఎస్ మిషన్' యాప్ మాయమైంది. గూగుల్ ప్లే లో ఉన్న యాప్ ను తొలగించారు. ఈ యాప్ అనుబంధ వెబ్ సైట్ కూడా ప్రస్తుతం పనిచేయకపోవడం గమనార్హం. తెలుగురాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ వ్యవహారం, డేటా చోరీ కేసులు తీవ్ర రూపం దాల్చిన వేళ, ముందు జాగ్రత్తగా ఈ యాప్ ను తొలగించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుండగా, టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ యాప్ కు, పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని, అదేమీ అధికారిక యాప్ కాదని, ఎవరు ఉంచారో, ఎవరు తొలగించారో తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News