vishal: విశాల్ 'అయోగ్య' విడుదల తేదీ ఖరారు

  • 'టెంపర్' రీమేక్ గా 'అయోగ్య'
  • విశాల్ జోడీగా రాశి ఖన్నా
  •  ఏప్రిల్ 19న విడుదల ఖరారు     

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' .. మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల హిందీలో 'సింబా' పేరుతో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ సినిమా తమిళంలో విశాల్ హీరోగా రూపొందింది. 'అయోగ్య' పేరుతో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటించింది.

తమిళంలో ఈ సినిమా విడుదలకి ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పార్తీబన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. విశాల్ కి మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉండటం వలన, ఈ సినిమా ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. తెలుగు.. హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తమిళంలోను సందడి చేస్తుందేమో చూడాలి. 

More Telugu News