Rahul Gandhi: రాఫెల్ స్కాంలో ప్రధాని మోదీని విచారించడానికి ఈ ఆధారాలు చాలు: రాహుల్ ధ్వజం

  • వ్యవస్థలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు
  • ఈ కేసు విచారణ మోదీతో మొదలై మోదీతోనే ముగుస్తుంది
  • కేంద్రంపై విరుచుకుపడిన కాంగ్రెస్ అధ్యక్షుడు

రాఫెల్ స్కాంలో ప్రధాన పాపం ప్రధాని నరేంద్ర మోదీదేనంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి ఉద్ఘాటించారు. ఈ వ్యవహారంలో ప్రధానిపై విచారణ జరపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో కేంద్రం తన వాదనలు వినిపిస్తూ, 36 రాఫెల్ జెట్ విమానాల ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని నివేదించింది.

కేంద్రం చెప్పిన ఈ విషయం విని విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. దేశ రక్షణలో ఎంతో కీలకమైన ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మోదీనే వేలెత్తిచూపిస్తాయని, ఇప్పుడా పత్రాలే పోయాయని చెబుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఇది నిస్సందేహంగా సాక్ష్యాధారాలను నాశనం చేయడమేనని ఆరోపించారు. తద్వారా వ్యవస్థలనే ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

More Telugu News