Pakistan: ‘జైషే మహ్మద్‌’పై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్న పాక్ ప్రభుత్వం, ఆర్మీ

  • ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్న పాక్
  • మసూద్ అజార్ పాక్‌లోనే ఉన్నారన్న మంత్రి
  • జైషే మహ్మద్ తమ దేశంలోనే లేదన్న ఆర్మీ

జైషే మహ్మద్ ఉనికే తమ దేశంలో లేదని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. పాక్ ప్రభుత్వం, ఆర్మీ పరస్పర విరుద్ధ ప్రకటనలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. పుల్వామా దాడి తమ పనేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జైషే ప్రధాన ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన బాంబులతో తీవ్ర స్థాయిలో దాడి చేసింది. అప్పటి నుంచి పాక్ పొంతన లేని ప్రకటనలు చేస్తోంది.

జైషే సహా నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు ఇటీవల ప్రకటించిన పాక్.. ఇప్పుడు అసలు తమ దేశంలో జైషే మహ్మద్ అనేదే లేదని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల పాక్ మంత్రి షా మహమూద్ ఖురేషి కూడా జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే వున్నట్టు ప్రకటించారు. దీనికి భిన్నమైన ప్రకటన నేడు పాక్ ఆర్మీ ప్రతినిధి చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News