kanna lakshminarayana: చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరాం: కన్నా లక్ష్మీనారాయణ

  • డేటా చోరీ కేసును సీబీఐ విచారించాలి
  • ఈ కేసులో ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు
  • 5 కోట్ల ఆంధ్రుల డేటాను ట్యాంపర్ చేశారు

డేటా చోరీ అంశంపై గవర్నర్ నరసింహన్ కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, చిన్న కేసుపై విచారణ జరుగుతుంటే... ఇందులో ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు డ్రామా కంపెనీల్లా వ్యవహరిస్తున్నాయని అన్నారు. డేటా చోరీ అంశంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే... సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

5 కోట్ల ఆంధ్రుల డేటాను ట్యాంపర్ చేశారని కన్నా మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ప్రతి చిన్న కేసుపై ముఖ్యమంత్రి సహా అందరు అధికారులు మాట్లాడుతున్నారని అన్నారు. గవర్నర్ కు అన్ని విషయాలను వివరించామని చెప్పారు.

More Telugu News