Maharashtra: మోదీని పొగిడి చిక్కుల్లో పడిన సీపీఎం కార్యదర్శి.. మూడు నెలలు సస్పెన్షన్

  • బహిరంగ సభలో మోదీ, ఫడ్నవిస్‌పై ప్రశంస
  • మోదీకి ప్రధానిగా మరో అవకాశం ఇవ్వాలని కోరిక
  • తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం

ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీని పొగిడిన సీపీఎం మహారాష్ట్ర కార్యదర్శి నర్సయ్య ఆదంపై పార్టీ అధిష్ఠానం వేటేసింది. పార్టీ కేంద్ర కమిటీ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. షోలాపూర్‌లో జనవరి 9న జరిగిన బహిరంగ సభలో నర్సయ్య మాట్లాడుతూ.. షోలాపూర్ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతి ఇవ్వడంపై ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాన మంత్రిగా మోదీకి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పైనా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర కమిటీ.. క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నర్సయ్య వ్యాఖ్యలు పారీ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొంటూ మూడు  నెలలు సస్పెండ్ చేసింది.  

More Telugu News