Vijay Sethupathi: ‘96’ రీమేక్‌కు ఆసక్తికర టైటిల్‌ను రిజిస్టర్ చేయించిన చిత్రబృందం!

  • శర్వా, సమంత జంటగా రీమేక్
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు
  • జానకికి వీరాభిమానిగా సామ్

తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96‘ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి టాలీవుడ్‌లో శర్వానంద్, సమంత జంటగా రీమేక్ రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ్‌లో దర్శకత్వం వహించిన ప్రేమ్‌ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో్ ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను చిత్రబృందం రిజిస్టర్ చేయించిందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ గాయని ఎస్ జానకికి వీరాభిమానిగా సమంత నటిస్తోంది. ఆమె పాడిన పాటలను సామ్ ఈ చిత్రంలో పాడుతూ ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రానికి ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నారని సమాచారం.

More Telugu News