Hyderabad: మియాపూర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

  • 40 ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు ప్రారంభం
  • జీరో శాతం పొల్యూషన్ తో నడిచే బస్సులు
  • ఈ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు

హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ మియాపూర్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ఈ రోజు ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ, వీటిని ఒకసారి చార్జ్ చేస్తే 350 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ప్రయాణించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ బస్సుల్లో సెంట్రల్లీ ఏసీ, వైఫై, జీపీఎస్, ఆటో అడ్జెస్ట్ మెంట్, అలారం, ఎమర్జెన్సీ ఎగ్జిట్, సీసీ కెమెరాలతో అత్యాధునిక సదుపాయాలు కల్పించామని, జీరో శాతం పొల్యూషన్ తో ఈ బస్సు నడుస్తుందని అన్నారు. కాగా, 40 ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు నుంచి తిరగడం ప్రారంభమైంది. 

More Telugu News