Abhinandan: విద్యార్థుల పాఠ్య పుస్తకాలలోకి అభినందన్‌‌ జీవిత కథ!

  • రాజస్థాన్ లో పాఠ్యాంశంగా అభినందన్ సాహస గాథ
  • ప్రతిపాదించిన విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్
  • అభినందన్ విద్యాభ్యాసం జోధ్‌పూర్‌లో జరిగింది

పాక్ చేతుల్లో చిక్కినప్పటికీ ఏమాత్రం తొణక్కుండా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ సాహస గాథను రాజస్థాన్‌లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాస్ర.. అభినందన్ కథను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చారు.

అభినందన్ వైమానిక దాడుల సమయంలోనూ.. అనంతరం చూపిన ధైర్య సాహసాలు భావి తరాలకు చెందిన విద్యార్థులకు తెలియపరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అభినందన్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా ఆయనను గౌరవిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అభినందన్ విద్యాభ్యాసం జోధ్‌పూర్‌లో జరిగిందని గోవింద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

More Telugu News