jaish-e-mohammad: పాక్ లో జైషే మహమ్మద్ అధినేత సోదరుడు హమజ్ అరెస్టు!

  • నిషేధిత ‘ఉగ్ర’ సంస్థలకు చెందిన 44 మంది అరెస్టు
  • హమజ్ తో పాటు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ కూడా 
  • పాక్ మంత్రి ప్రకటన 

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత యావత్తు ప్రపంచం భారత్ కు మద్దతుగా నిలిచింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ తీవ్ర చర్యలు తీసుకోవాలని, వారి గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని పాక్ పై ఒత్తిడి పెరిగింది.

 ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని ఈరోజు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడు హమజ్ కూడా ఉన్నాడు.  హమజ్ తో పాటు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పాక్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి షెహ్ర్యార్ ఖాన్ అఫ్రిది తెలిపారు. 

More Telugu News