sensex: ప్రభావం చూపని ట్రంప్ వ్యాఖ్యలు... భారీగా లాభపడ్డ సెన్సెక్స్

  • భారత్ కు ప్రాధాన్యతా వాణిజ్య హోదాను తొలగిస్తామంటూ ట్రంప్ ప్రకటన
  • వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 379 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

భారత ఎగుమతులపై తాము సుంకాలను తగ్గించినా... భారత్ మాత్రం తమ ఎగుమతులపై భారీ సుంకాలను వసూలు చేస్తోందని... భారత్ కు ప్రాధాన్యతా వాణిజ్య హోదాను తొలగిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు పని చేయనట్టే ఉన్నాయి. ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంతో దాదాపు 5.6 బిలియన్ డాలర్ల భారత ఎగుమతులపై ప్రభావం పడనుంది. అయినప్పటికీ... దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  ఏకంగా 379 పాయింట్లు లాభపడి 36,443కు ఎగబాకింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 10,987 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (7.72%), హీరో మోటో కార్ప్ (4.60%), యాక్సిస్ బ్యాంక్ (4.12%), ఓఎన్జీసీ (3.96%),  కోల్ ఇండియా (3.40%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.15%),  హిందుస్థాన్ యూనిలీవర్ (-0.62%), టీసీఎస్ (-0.19%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.16%), ఎల్ అండ్ టీ (-0.15%).

More Telugu News