pakistan: ఇంత జరిగాక కూడా... పాక్, పీవోకేలలో 16 టెర్రర్ క్యాంపులు యాక్టివ్ గా ఉన్నాయి: ఇంటెలిజెన్స్

  • బాలాకోట్ దాడుల తర్వాత కూడా తగ్గని ఉగ్ర కార్యకలాపాలు
  • పాక్ ప్రధాన భూభాగంలో ఐదు యాక్టివ్ క్యాంపులు
  • 2018లో ట్రైనింగ్ పొందిన 560 మంది ఉగ్రవాదులు

పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసినప్పటికీ... ఆ దేశంలో ఉగ్ర కార్యకలాపాలు మాత్రం తగ్గలేదు. పాకిస్థాన్ ప్రధాన భూభాగం, పాక్ ఆక్రమిత కశ్మీరులలో 16 టెర్రర్ క్యాంపులు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ టెర్రర్ క్యాంపులన్నీ పాకిస్థాన్ సైనిక స్థావరాలకు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.

ఈ 16 టెర్రర్ క్యాంపుల్లో 11 పాక్ ఆక్రమిత కశ్మీలో ఉన్నాయి. ఈ 11 స్థావరాల్లో 5 స్థావరాలు ముజఫరాబాద్, కోట్లీ, బర్నాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన ఐదు స్థావరాలు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. మన్షెరాలో మూడు, పంజాబ్ (పాక్)లో రెండు స్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయి. వీటి ట్రైనింగ్ సెంటర్లలో ఉగ్రవాదులకు కమెండో తరహా శిక్షణ ఇస్తున్నారు. ఐఈడీ బ్లాస్ట్, స్నైపర్ అటాక్, నీటి కింద భాగంలో పోరాటం, డ్రోన్ ఆపరేషన్ తదితర అంశాల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు. ఈ క్యాంపుల నుంచి 2018లో కనీసం 560 మంది టెర్రరిస్టులు భారత్ పై దాడులకు తెగబడేందుకు శిక్షణ పొందారు.

మరోవైపు, పాక్ లోని ఉగ్రస్థావరాల శాటిలైట్ చిత్రాలను ప్రపంచ దేశాలకు అందజేసే యోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

More Telugu News