nagababu: 'రుద్రవీణ'వలన పేరు వచ్చింది గానీ .. డబ్బులు పోయాయి: నాగబాబు

  • శంకరాభరణం' హిట్ అయింది
  •  అలాంటి సినిమా చేయాలనుకున్నాం
  •  'రుద్రవీణ' పరాజయం పాలైంది      

తాజాగా నాగబాబు 'నా ఛానల్ .. నా ఇష్టం' వీడియోలో 'రుద్రవీణ' సినిమాను గురించి ప్రస్తావించారు. "అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో 'రుద్రవీణ' మొదటి సినిమా. అన్నయ్యతో ట్రావెల్ చేయాలనే కోరికతో .. అన్నయ్య సూచన మేరకు ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి అంగీకరించాను. 'శంకరాభరణం' కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక 'సింధుభైరవి' సినిమా కూడా నాకు బాగా నచ్చడంతో .. అలాంటి సినిమా తీయాలనిపించింది.

బాలచందర్ గారితో మాట్లాడి 'రుద్రవీణ' సినిమాను తీశాము. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒకటిన్నర ఏడాది పట్టింది. అప్పట్లో ఒక్క రోజులోనే ఇళయరాజా గారు అన్ని పాటలకు ట్యూన్స్ చేసేశారు. అప్పట్లో 85 .. 90 లక్షల వరకూ బడ్జెట్ అయింది. సినిమా పరాజయంపాలు కావడంతో బాధపడ్డాము. ఆ సినిమా మంచి పేరు తెచ్చినా, ఇప్పుడు అలాంటి కథతో ఎవరైనా వచ్చినా సాహసం చేయలేము. పేరుకి నిర్మాతను నేనే అయినా .. డబ్బులు అన్నయ్యవి. ఈ సినిమాకి గాను ఆయన ఓ 10 .. 15లక్షలు నష్టపోయాడు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News