vijay devarakonda: బైక్ రేసింగ్ ప్రాక్టీస్ లో విజయ్ దేవరకొండ

  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
  • తదుపరి సినిమా క్రాంతి మాధవ్ తో
  • లైన్లో తమిళ దర్శకుడు ఆనంద్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేపనిలో వున్నాడు. అలాగే క్రాంతిమాధవ్ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే పట్టుదలతో వున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన తమిళ దర్శకుడు ఆనంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు.

ఇందుకోసం ఆయన కొన్ని రోజులుగా తమిళనాడులో వున్న ఓ రేసింగ్ ట్రాక్ పై చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఢిల్లీలోని ఒక రేస్ ట్రాక్ పై ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈలోగా విజయ్ దేవరకొండ తన ప్రాక్టీస్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ సినిమా షూటింగు ఎప్పుడు మొదలవుతుంది? కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారు? ప్రతినాయకుడిగా ఎవరు చేయనున్నారు? వంటి విషయాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News