karate kalyani: నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను: నటి కరాటే కల్యాణి

  • చిన్నప్పటి నుంచి రఫ్ గా ఉండేదానిని
  • కరాటేలో నాలుగు గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను
  • పోలీస్ జాబ్ చేయాలని ఆశ పడేదాన్ని    

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కల్యాణి ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ .. ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " చిన్నప్పటి నుంచి కూడా నాకు కరాటే అంటే ఇష్టం. కరాటే నేర్చుకుని పోలీస్ జాబ్ చేయాలనే ఆశ ఉండేది. దాంతో మా నాన్న నాకు కరాటే నేర్పించాడు.

కరాటేలో నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది .. జాతీయస్థాయిలో నేను నాలుగు సార్లు గోల్డ్ మెడల్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను కాస్త రఫ్ గానే ఉండేదానిని. నేను పోటీలకు వెళుతున్నాను అంటే మెడల్ తెస్తాననే నమ్మకం అందరిలోను ఉండేది. మాది చాలా పూర్ ఫ్యామిలీ .. జాతీయస్థాయిలో కరాటేలో పాల్గొనడానికే చాలా కష్టాలు పడ్డాను. అంతర్జాతీయస్థాయి పోటీలకు వెళ్లడానికి కూడా ఎంపికయ్యాను. కానీ నాన్నను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్లలేదు. పెద్దగా చదువుకోని కారణంగా పోలీస్ జాబ్ రాలేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News