America: తూచ్.. మేం వాడింది ఎఫ్-16 కాదు.. అమెరికా ఆగ్రహంతో మాటమార్చిన పాక్

  • కూలింది చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానం
  • అమెరికా ఆగ్రహంతో బుకాయించిన పాక్
  • కూలింది ఎఫ్-16 విమానమేనన్న భారత వాయుసేన చీఫ్

భారత దాడిలో ఎఫ్-16 విమానం కోల్పోయిన పాక్.. అమెరికా ఆగ్రహానికి గురైంది. ఎఫ్-16 దుర్వినియోగంపై వివరణ ఇవ్వాల్సిందిగా పాక్‌ను ఆదేశించింది. దేశాలపై దాడులకు ఈ విమానాలను వాడకూడదన్న షరతుతోనే వాటిని పాక్‌కు విక్రయించింది. ఇప్పుడు భారత్‌పై దాడికి వాటిని ఉపయోగించడంపై ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్పాలంటూ వివరణ కోరింది.

దీంతో తత్తరపడిన పాక్ మాటమార్చింది. తామసలు ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వాడలేదని, చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానాన్ని వాడామని వివరణ ఇచ్చింది. చైనాతో కలిసి తాము తయారుచేసుకున్న జేఎఫ్-17 విమానంతోనే తాము అభినందన్ మిగ్ విమానాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇందుకోసం సీఎన్ఎన్ ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. భారత వాయుసేనకు చెందిన మిగ్ -21 దాడిలో చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానం ఒకటి కూలిపోయిందని సీఎన్ఎన్ ప్రచురించింది. పాక్ బుకాయింపును భారత వాయుసేన చీఫ్ ధనోవా కొట్టిపడేశారు. తాము కూల్చింది ఎఫ్-16 యుద్ధ విమానమేనని తేల్చిచెప్పారు.

More Telugu News