India: జిప్సీకి మంగళం పాడేసిన మారుతీ సుజుకీ

  • సాయుధ దళాల ఫేవరెట్ వాహనం
  • ఉత్పత్తి నిలిపేసిన కంపెనీ
  • ముగిసిన మూడున్నర దశాబ్దాల ప్రస్థానం

ఒకప్పుడు అంబాసిడర్ కారు భారత రోడ్లపై జోరుగా పరుగులు తీస్తున్న కాలంలో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది మారుతీ జిప్సీ, అప్పటికి అంబాసిడర్లు, ఫియట్ కార్లు చూసిన భారత ప్రజలు జిప్సీ స్టయిల్ కు ఫిదా అయ్యారు. కానీ కాలంతో పోటీపడడంలో ఈ వాహనం విఫలమైంది. సాయుధ దళాల్లో తప్ప బయట ఎక్కువగా కనిపించని వాహనంగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది జిప్సీ. 1985లో మొదలైన జిప్సీ ప్రస్థానానికి మారుతీ సుజకీ సంస్థ మూడున్నర దశాబ్దాల తర్వాత తెరదించింది. జిప్సీ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

అప్పట్లో మారుతీ సంస్థ మారుతి 800, మారుతీ ఓమ్నీ వాహనాలతో పాటు జిప్సీని తీసుకువచ్చింది. మారుతీ 800 విపరీతమైన ప్రజాదరణ పొందగా, ఓమ్నీ కమర్షియల్ వాహనంగా గుర్తింపు పొందింది. జిప్సీ మాత్రం సాయుధ దళాల్లో విపరీతమైన ప్రాచుర్యం దక్కించుకుంది. కానీ ఇప్పుడొస్తున్న కొత్త వాహనాలతో పోలిస్తే జిప్సీ ఎంతో సాధారణంగా కనిపిస్తుందన్నది కాదనలేని వాస్తవం. కంపెనీ కూడా ఈ విషయం గమనించే ఉత్పత్తికి మంగళం పాడేసింది. ఈ మేరకు జిప్సీలకు కొత్త ఆర్డర్లు తీసుకోవద్దంటూ తన డీలర్లకు  స్పష్టం చేసింది.

More Telugu News