sharwanand: 'జానకీదేవి'గా కనిపించనున్న సమంత

  • తమిళంలో హిట్ కొట్టిన '96'
  • తెలుగు టైటిల్ పై పూర్తయిన కసరత్తు 
  • ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలు  

తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటంచిన '96' భారీ విజయాన్ని సాధించింది. వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. నాయకా నాయికలుగా శర్వానంద్ - సమంతలను ఎంపిక చేసుకున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో చిన్నచిన్న మార్పులు చేయించిన దిల్ రాజు, టైటిల్ కూడా తెలుగులో ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమా కోసం 'జాను' .. 'జాను అలియాస్ జానకి' అనే రెండు పేర్లను పరిశీలించారు. తాజాగా 'జానకీదేవి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజు .. ఆ రోజున టైటిల్ లోగోను రిలీజ్ చేయడం జరగొచ్చని చెప్పుకుంటున్నారు. ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. 

More Telugu News