kalyan ram: రెండు రోజుల్లో కల్యాణ్ రామ్ సినిమా గ్రాస్ వసూలు 5.50 కోట్లు

  • కల్యాణ్ రామ్ నుంచి '118'
  •  లాభాల బాట పట్టే అవకాశం
  •  తదుపరి సినిమా శ్రీవాస్ తో  

కల్యాణ్ రామ్ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. అయినా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా సక్సెస్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గుహన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి రంగంలోకి దిగిపోయాడు. '118' పేరుతో ఈ సినిమా ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాలు .. గుహన్ టేకింగ్ .. ఫొటోగ్రఫీ ఈ సినిమాను నిలబెట్టేశాయి.

లుక్ పరంగాను .. నటన పరంగాను కల్యాణ్ రామ్ మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. తొలివారంలోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ కి హిట్ పడిపోయిందనే అంటున్నారు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.

More Telugu News