Sneha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ధనుశ్ తో మళ్లీ జోడీ కడుతున్న స్నేహ 
  • విజయ్ దేవరకొండ హీరోగా త్రిభాషా చిత్రం 
  • త్రివిక్రమ్ సినిమాలో నగ్మా లేదట! 

*  చాలా కాలం తర్వాత కథానాయిక స్నేహ మళ్లీ ధనుశ్ సరసన నటించనుంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందే తమిళ చిత్రంలో ధనుశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో తండ్రి పాత్ర సరసన స్నేహ నాయికగా నటిస్తుందట.
*  విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించే ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ప్రస్తుతం విజయ తో 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది.
*  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందే చిత్రంలో హీరోకి తల్లిగా ప్రముఖ నటి నగ్మా నటించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని నగ్మా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తెలుగులో నటించాలని ఎదురుచూస్తున్నానని, అయితే, ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది.

More Telugu News